అనారోగ్యంతో భార్య మృతి.. రోదిస్తూ గుండెపోటుతో భర్త మృతి - అనారోగ్యంతో భార్య మృతి.. రోదిస్తూ గుండెపోటుతో భర్త మృతి
10:17 October 29
couple death in vishaka
జీవితాంతం తోడు నీడగా ఉంటామని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే పయనించాడు ఆ భర్త. చావులోను వారి బంధం విడిపోలేదు. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త గుండె ఆగిపోయింది. ఇద్దరూ ఒకేరోజు మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విశాఖ జిల్లా రావికమతానికి చెందిన వెంకటరమణ(56), వరలక్ష్మి(50) దంపతులు. వారిలో అనారోగ్యంతో వరలక్ష్మి మృతి చెందగా.. భార్య మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో భర్త వెంకటరమణ మృతి చెందాడు. ఇద్దరూ ఒకేరోజు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు