ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం - అమరావతి

ఓట్ల లెక్కింపు శిక్షణకు విశాఖ జిల్లా నుంచి ఎనిమిది మంది అధికారుల బృందం పాల్గొననున్నారు. అమరావతిలో ఈనెల 7న ఎన్నికల సంఘం ఈ శిబిరం నిర్వహించనుంది.

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

By

Published : May 6, 2019, 3:03 PM IST

ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధివిధానాలపై ఈనెల 7న అమరావతిలో ఎన్నికల సంఘం శిక్షణ శిబిరం నిర్వహించనుంది. దీనికి విశాఖ నుంచి 8 మంది అధికారుల బృందం హాజరవనుంది. వీరిలో జేసీ సృజన, పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. వీరు ఈరోజు రాత్రి బయలుదేరి రేపు అమరావతి చేరుకుంటారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీవీప్యాట్ లెక్కింపు తదితర అంశాలపై ఈసీ వీరికి శిక్షణ ఇస్తుంది.

ఇవీ చదవండి..

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

ABOUT THE AUTHOR

...view details