విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకు వచ్చిన కానుకలను ఆలయ ఈఓ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 28,21,725, బంగారం 66.200 గ్రాములు, వెండి 285 గ్రాములు లభించింది. ఆలయ ఈవో ఎస్జే మాధవి పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది. దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్ కుమార్, ఆలయ ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరిభావననారాయణ పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 28 లక్షలు
విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీలను ఆలయ ఈవో ఎస్జే. మాధవి, దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్‌కుమార్, ఆలయ ఏఈవోల పర్యవేక్షణలో లెక్కించారు.
విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయంలో హుండీల లెక్కింపు