అంతర్జాతీయ సముద్రతీర పరిశుభ్రత దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్ లో నగర పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి,ఎంవీవీ సత్యనారాయణ,మంత్రులు మోపిదేవి వెంకటరమణ,ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని,సాగరతీరంలో వ్యర్థాలను తొలగించారు.నెలలో ఒక రోజు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని మంత్రులు సూచించారు.విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు.కార్యక్రమంలో డీఐజీ రంగారావు,నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా,జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్,ఏయూ వీసీ ప్రసాద రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
విశాఖలో సందడిగా సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం - విశాఖ బీచ్ రోడ్
రాష్ట్రంలోని ప్రముఖ బీచ్‌ల్లో అంతర్జాతీయ సముద్రతీర పరిశుభ్రత దినోత్సవాన్ని మెరైన్ పోలీసులు ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్‌లో కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విశాఖలో సందడిగా సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం