విశాఖ మన్యం చింతపల్లి మండలం అన్నవరం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు కరోనా సోకింది. కానిస్టేబుల్ తన సొంత ఊరు విజయనగరం వెళ్లి తిరిగి వచ్చినప్పుడు నర్సీపట్నంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. విధులకు వచ్చిన కానిస్టేబుల్ హోమ్ క్వరంటైన్లో ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో అతనిని విశాఖపట్నం తరలించారు. కానీ, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించడం లేదు. వేరే జిల్లా నుంచి కరోనా కాంటాక్ట్ కావటంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కానిస్టేబుల్ ముందస్తుగా హోమ్ క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాడేరు మన్యంలో ఒక్క కేసు కూడా ప్రస్తుతము నమోదు కాలేదు. కానిస్టేబుల్ కు కరోనా వచ్చిందని సమాచారం అందుకున్న స్థానికులలో కలవరం మొదలైంది.
కానిస్టేబుల్కు కరోనా... ధృవీకరించని పోలీసు ఉన్నతాధికారులు - carona to constable not confirmed by police
విశాఖ ఏజెన్సీ ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కు కరోనా సోకినట్లు కలకలం సృష్టించింది. తన సొంత ఊరు ఊరు విజయనగరం వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వైరస్ సోకింది. కానిస్టేబుల్ ముందస్తుగా హోమ్ క్వరెంటైన్లో ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కానిస్టేబుల్కు కరోనా వచ్చిందని పోలీస్ అధికారుల ధృవీకరించలేదు.
కానిస్టేబుల్ కు కరోనా ధృవీకరించని పోలీసు ఉన్నతాధికారులుw