ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగులలో మళ్లీ కరోనా విజృంభణ - మాడుగులలో కరోనా వార్తలు

విశాఖజిల్లా మాడుగులలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. 3 రోజుల్లో 14 మందికి వైరస్ సోకింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.

corona virus at madugula
మాడుగులలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ

By

Published : Oct 19, 2020, 11:02 PM IST

విశాఖ జిల్లా మాడుగులలో మళ్లీ కరోనా కోరలు చాపుతోంది. కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినా.. మళ్లీ వ్యాప్తి చెందుతోంది. మాడుగుల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓకు కరోనా సోకింది. కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో వారికి నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మండల వ్యాప్తంగా మూడు రోజుల్లో దాదాపుగా వంద మందికి కొవిడ్ పరీక్షలు చేయగా... వారిలో 14 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని వైద్యులు, అధికారులు సూచనలు చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details