విశాఖ జిల్లా చీడికాడ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తోంది. రెండురోజుల క్రితం కార్యాలయంలో ఓ అధికారికి పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి నుంచి కార్యాలయంలో ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్ పాజిటివ్ తేలింది. వైరస్‌తో కార్యాలయం సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులను కలిసిన సిబ్బంది కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు.
చీడికాడ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా విశాఖ జిల్లా చీడికాడ తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తికి కరోనా రావటంతో సిబ్బంది భయందోళనలో ఉన్నారు.
చీడికాడ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం