విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో గుర్తించిన 116 మంది కరోనా అనుమానితులకు ఇవాళ పరీక్షలు నిర్వహించారు. విశాఖ నుంచి ప్రత్యేక వైద్య బృందం అంబులెన్స్‌లో యలమంచిలి చేరుకుంది. పట్టణంతో సహా గ్రామాల్లో గుర్తించిన అనుమానితులను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్దకు రప్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎవరికైనా కరోనా ఉన్నట్లు నివేదికలో తేలితే ఐసోలేషన్‌కు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ కనకరాజు చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న అనుమానితులను వాలంటీర్ల ద్వారా గుర్తించామన్నారు.
116 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు - యలమంచిలి తాజా వార్తలు
ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేలో గుర్తించిన అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. యలమంచి మున్సిపాలిటీలో పరిధిలోని 116 మందికి ఇవాళ కరోనా పరీక్షలు చేశారు.
corona tests for 116 persons in yalamanchili