బ్యాంకుల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వ్యాధి బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా.. అధికారులు అప్రమత్తం అవుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని గంటలు నిర్దేశించారు.
ముందు జాగ్రత్తగా బ్యాంకుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. పరిమితంగానే ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులను కచ్చితంగా.. మాస్క్ ఉంటేనే లోనికి అనుమతి ఇస్తున్నారు. భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.