విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు, గన్మెన్లకు కరోనా పాజిటివ్ రావడం ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మన్యంలో కొవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న కారణంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించారు. ఎవరూ వ్యక్తిగత పనుల మీద ఇతర కార్యకలాపాలపై కార్యాలయానికి రావద్దని అవసరం ఉంటే ఫోన్లో సంప్రదించాలని ఆమె సూచించారు. కార్యాలయ సిబ్బందికి కూడా ఫోన్లో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందికి కరోనా.. హోమ్ క్వారంటైన్లో భాగ్యలక్ష్మి - mla bhagyalakshmi in home quarantine latest news
విశాఖ జిల్లా పాడేరు మన్యంలో కొవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యక్తిగత సహాయకుడుకి, గన్మెన్లకు కరోనా పాజిటివ్ రావడం ఆమె కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
Breaking News