ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ముగ్గురికి కరోనా - విశాఖలో కరోనా కేసులు

విశాఖ నగరంలో శ్రీ కనకమహాలక్ష్మి అలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఫలితంగా అధికారులు అప్రమత్తమై దర్శనాలు నిలిపివేశారు.

Corona Positive for three at Visakha Sri Kanakamahalakshmi Temple staff
విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

By

Published : Jun 28, 2020, 4:58 PM IST

విశాఖ నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంతో పాటు అంబికా బాగ్ రామాలయం సిబ్బందికి.. దేవస్థానం అధికారులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.

అంబికా బాగ్​లో పూజారికి, కనకమహాలక్ష్మి ఆలయంలో ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినట్ల తేలింది. ఫలితంగా అప్రమత్తమైన ఆలయ అధికారులు.. ఆలయాన్ని మూసివేసి శానిటైజేషన్ చేపట్టారు. ఆది, సోమవారాలు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details