విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.... వారిలో 56 మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మరో 25 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.
కరోనా నియంత్రణలో అధికారులు గట్టి కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. కేసులు పెరిగినా.. వాటికి అవసరమైన బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారని... వైద్య సిబ్బందికి కావలసిన మాస్క్ లు, పీపీఈ కిట్స్ ఉన్నాయని వివరించారు. 70 క్వారంటైన్ కేంద్రాల్లో ప్రస్తుతం 490 మంది ఉన్నారని తెలిపారు.
అబుదాబి, ఫిలిప్పీన్స్ నుంచి 84 మంది వచ్చారని.. వారిలో విశాఖకు చెందిన వారు 24 మంది ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు వివరించారు. విశాఖలో 4వ లాక్ డౌన్ లో 25 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని వెల్లడించారు. వార్డు వాలంటీర్స్ తో ఇప్పటికే 4 సార్లు సర్వే జరిగిందని చెప్పారు.
కంటైన్మెంట్ జోన్ నుంచి ఎవరూ బయటకు రావద్దని.. ప్రభుత్వం అనుమతించని దుకాణాలు తప్ప మిగిలిన వారు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. బౌతికదూరం పాటిస్తూ.. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి:తెలంగాణలో ఈ శుక్రవారం కట్టుదిట్టంగా లాక్డౌన్.. ఎందుకంటే?