విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీలో మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన పది మందిని గుర్తించి విశాఖ ఆస్పత్రికి తరలించగా... వారిలో ఏడుగురు వ్యక్తులకు నెగటివ్ గా పరీక్షల్లో ఫలితాలు వచ్చాయి. మిగతా ముగ్గురు వ్యక్తుల నివేదిక రావల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా 19 మంది నివేదికలు పెండింగ్‌లో ఉండగా... వారిలో ఈ ముగ్గురు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి నివేదిక త్వరలోనే వెల్లడిస్తామని నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీశివ జ్యోతి తెలిపారు.
కరోనా ఎఫెక్ట్‌తో విశాఖలో అధికారులు అప్రమత్తం - కరోనా పాజిటివ్ కేసులు వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా... అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 19 మంది పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉందని ఆర్డీవో లక్ష్మీశివ జ్యోతి తెలిపారు.
కరోనా ఎఫెక్ట్‌తో విశాఖలో అధికారులు అప్రమత్తం