విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒక్కరోజులోనే 25 మందికి కరోనా సోకడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గురువారం మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అనకాపల్లి పట్టణంలో కరోనా సోకిన వారి సంఖ్య 199 కి చేరింది.
అనకాపల్లిలో ఒకేరోజు 25 మందికి మహమ్మారి - corona at anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్క రోజే 25 మందికి కరోనా సోకింది. దీంతో అనకాపల్లి పట్టణంలో కరోనా సోకిన వారి సంఖ్య 199కి చేరింది.
![అనకాపల్లిలో ఒకేరోజు 25 మందికి మహమ్మారి corona increasing at anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8151667-608-8151667-1595571581654.jpg)
అనకాపల్లిలో ఒకేరోజు 25 మందికి మహమ్మారి
అనకాపల్లి లోని గాంధీనగరం, గవరపాలెం చదరం నూకయ్య గారి వీధి, నెయ్యిల వీధి, బుద్ధ సూర్యా రావు వీధి,మిర్యాల కాలనీ, దాసరి గెడ్డ రోడ్డు, పార్క్ సెంటర్, పీవీఆర్ నాయుడు వీధి, రజకుల కాలనీ, వేగి గౌరిసు వీధి లకు చెందిన వారికి కరోనా సోకింది. కరోనా నిర్ధరించిన వారిలో 15 మంది మహిళలు,10 మంది పురుషులు ఉన్నారు. వీరిని కరోనా కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి