ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెల్లో కరోనా భయం.. పనులకు వెళ్లేందుకు భయపడుతున్న జనం - today government works in visakhapatnam district news update

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కరోనా భయం పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చి పనులకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఈ ప్రభావం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై పడుతోంది. కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో.. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు ముందుగా నిర్ణయించుకున్న విధంగా లక్ష్యాలను పూర్తి చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.

government Construction works are slow down
కరోనా కారణంగా నెమ్మదించిన హరదారి నిర్మాణ పనులు

By

Published : May 19, 2021, 12:02 PM IST

నర్సీపట్నం నియోజకవర్గంలోని నర్సీపట్నం గొలుగొండ నాతవరం మాకవరపాలెం మండలాలకు 60 రైతు భరోసా కేంద్రాలు మంజూరయ్యాయి. సుమారు 50 భవనాల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పూర్తి చేయాలని అధికారులు కొద్ది రోజులుగా ప్రయత్నాలు జరుపుతున్నారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెల్లోని ప్రజలను కరోనా భయం పీడిస్తుండటంతోయయ గ్రామాల్లో పరిస్థితి బాగాలేదని నాలుగు రోజులు ఆగి వస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వం ఒక్కో భవనానికి 18.7 లక్షల ఖర్చు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలు నిర్మాణానికి సంబంధించి ప్లాస్టింగ్ పనులు, తలుపులు , కిటికీలు బిగించడం తదితర చివరి దశలో పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఖరీఫ్​లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు పురుగుల మందులు వంటివి నిల్వచేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా గొలుగొండ మండలం వెంకటాపురం పాకలపాడు రోడ్డు నిర్మాణానికి 1.2 కోట్లు మంజూరు కాగా.. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. అవసరమైన కూలీలు దొరక్కపోవటంతో పనుల్లో తీవ్ర జాప్యం వెంటాడుతోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details