ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మృతదేహానికి అంతిమ సంస్కారం.. గిరిజన యువత ఆదర్శం

కరోనాతో మృతి చెందిన మృతదేహాలను జేసీబీల ద్వారా గోతులు తీసి పూడ్చి పెట్టే వారు ఉన్నారు. ఎంత దగ్గరివారైనా కరోనా చనిపోతే ఆ మృతదేహాలను తాకకుండా పారిపోయే వారు సైతం ఉన్నారు. మా గ్రామంలో కరోనా మృతులకు అంత్యక్రియలు వద్దు అని అడ్డుకునే ఉదంతాలు ఈ మధ్య చూస్తున్నాం. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తిని బంధువులు విడిచి వెళ్లిపోగా.. స్థానిక యువత, కొంతమంది బంధువులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగిన ఘటన వివరాలివి..!

Corona fear in Visakha agency
Corona fear in Visakha agency

By

Published : Jul 20, 2020, 3:12 PM IST

Updated : Jul 20, 2020, 3:33 PM IST

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో.. కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసేందుకు సాహసించేవారు లేక అనాథ శవాలుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ గిరిజన యువకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విశాఖపట్నంలో విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో చనిపోయారు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ముంచంగిపుట్టు మండలం కిలగాడ తరలించారు.

మృతునికి కరోనా ఉందని తెలియక బంధువులు మృతదేహంపై పడి రోదించారు. అనంతరం కరోనా ఉందని తెలియడంతో కొందరు బంధువులు మృతదేహాన్ని విడిచి వెళ్లిపోయారు. అధికారులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో స్థానిక యువత, మృతుని బంధువులు కొంతమంది మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. అనంతరం అందరూ కరోనా పరీక్షలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

Last Updated : Jul 20, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details