విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కరోనా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సెలవులు ఇవ్వగా హైదరాబాద్ నుంచి విశాఖ జిల్లా చింతపల్లి వచ్చాడు. మూడు రోజులుగా ఆ వ్యక్తికి తలనొప్పి, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానంతో స్వయంగా వచ్చి ఆసుపత్రిలో చేరారని డిప్యూటి సివిల్ సర్జన్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విశాఖ చాతి, శ్వాసకోస వ్యాధుల ఆసుపత్రికి తరలించామన్నారు.
యానాం పరిసర ప్రాంతంలో ముగ్గురికి
యానాం పరిసర గ్రామాలైన తాళ్లరేవు మండలానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని ప్రత్యేకగదుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. మస్కట్ నుంచి యానాంకు వచ్చిన మహిళలకు వైరస్ లక్షణాలు ఉండగా వైద్య పరీక్షలకు పంపించినట్లు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.