విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం రెండు వివాహాలు జరిగాయి. కేవలం వధూవరులు.. వారి తల్లిదండ్రులు మాత్రమే వివాహ తంతులో ఉన్నారు. పురోహితుడు మంత్రాలు చదవగా వధూవరులు ఒకటయ్యారు. వధూవరుల తల్లిదండ్రులు మాస్కులు ధరించి వివాహాన్ని జరిపించారు. కరోనా ప్రభావం వల్ల సందడిగా జరగాల్సిన పెళ్లి ఇలా జరిగాయి. ఇప్పటికే కరోనా ప్రభావంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొంతమంది మాత్రం తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.
ఈ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు మాత్రమే అతిథులు
పెళ్లంటే బంధుమిత్రుల సందడి.. మండపం నిండా జనాలతో ఒకటే హడావుడి. ఇది కరోనాకు ముందు జరిగిన పెళ్లిళ్ల తంతు. ఇప్పుడు మాత్రం జరిగే తీరు వేరు. పెళ్లి తంతు పూర్తిగా మారిపోయింది. విశాఖ జిల్లాలో జరిగిన రెండు పెళ్లిళ్లకు వధూవరుల తల్లిదండ్రులు మాత్రమే అతిథులయ్యారు.
corona effect on marriages