ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు

ఏ ఇంటికెళ్లినా... ముందుగా మనకి స్వాగతం పలికేది ద్వారబంధమే. చూపరులను ఆకర్షించేలా, ఇంటికే కొత్తందాన్నిచ్చేలా వాటిని చెక్కడంలో వడ్రంగుల నేర్పు అసమానమైనది. ద్వారబంధాలనే కాదు ఫర్నీచర్‌, గృహాలంకరణకు కొత్త నగిషీలద్దడంలో వారి ప్రతిభ ప్రత్యేకం. అది, ఇది అని తేడా లేకుండా అన్ని రంగాలనూ దారుణంగా దెబ్బతీసిన కొవిడ్‌ ధాటికి.... రాష్ట్రవ్యాప్తంగా వడ్రంగులూ అల్లాడుతున్నారు. వండ్రంగుల కష్టాలపై ప్రత్యేక కథనం..!

corona effect on carpenters
కరోనా ఎఫెక్ట్.. ఉపాధి కోల్పోయిన కార్పెంటర్లు

By

Published : Jul 9, 2020, 1:30 PM IST

ఉపాధి లేక కార్పెంటర్ల అవస్థలు

గృహ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే కార్పెంటర్లకు ఎంతో గిరాకీ ఉండేది ఒకప్పుడు. ఫర్నిచర్ దుకాణాలు వచ్చిన తర్వాత వారికి పని తగ్గినా.. ఇప్పటికీ పీస్ రేట్ కార్మికులుగా, కాంట్రాక్ట్ పనివారిగా ఎంతో కొంత ఆదాయం పొందుతున్నారు. అయితే కరోనా కారణంగా వారి బతుకులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. పని దొరక్క, ఆదాయం రాక అవస్థలు పడుతున్నారు.

కార్పెంటరీని నమ్ముకుని... రాష్ట్రంలో సుమారు 12 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిర్మాణ రంగం బాగుంటేనే వీరి బతుకులు బాగుంటాయి. ఆర్డర్లు వస్తాయి. చేతిలో ఉలి ఆడుతుంది. కర్రలో కళాత్మకత వెలికి వస్తుంది. కానీ ప్రస్తుతం అంతా తారుమారైంది. కరోనా వల్ల నిర్మాణ రంగంలోనూ నిస్తేజం ఆవరించింది. పని దొరక్క ఆదాయం పుట్టట్లేదని వడ్రంగులు అంటున్నారు. అసంఘటిత రంగంలోని అనేక వర్గాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్న ప్రభుత్వం.. తమనూ ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు కార్పెంటర్లు.

ABOUT THE AUTHOR

...view details