విశాఖ జిల్లా అనకాపల్లిలో కొంతమంది వ్యాపారులు రామచిలుకలు, రంగురంగుల చేపలు, కుందేలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దుకాణాలు తెరిచి పక్షులకు ఆహారం అందించడం ఇబ్బందిగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. ఆహారం దొరక్క మూగజీవులు చనిపోయి.. నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదేమి పరిస్థితి..మూగజీవాలకు తిండి కరవు - విశాఖ జిల్లా
కరోనా ప్రభావం మనుషుల మీదే కాదు మూగజీవులపైనా పడుతోంది. ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దుకాణాలు తెరిచి.. పక్షులకు ఆహారం అందించడం వ్యాపారులకు కష్టంగా మారింది.
చేపలు, విదేశాల తెప్పించిన రామచిలుకలను అనకాపల్లిలో అమ్ముతూ.. పలువురు జీవనం కొనసాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో దుకాణాలు తెరవడం కష్టంగా మారింది. అమ్మకాలు సంగతి ఎలా ఉన్నా.. కనీసం మూగజీవాలకు ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పోలీసులకు మొరపెట్టుకోగా.. రోజుకి రెండు నుంచి మూడుసార్లు ఆహారం అందించేందుకు అనుమతించారు. రోజుకు ఐదుసార్లు ఆహారం వేయాలని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్వేరియంలో నీరు మార్చకపోతే... చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు పక్షులు చేపలు చనిపోయాయని.. లక్షల్లో నష్టం వాటిల్లిందంటున్నారు.
ఇదీ చదవండి: 'ఎక్కువ మాట్లాడండి... కరోనాను జయించండి!'