విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణంతో ఇప్పటికే పట్టణంలో నలుగురు మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. పట్టణంలోనే కాకుండా నియోజకవర్గంలోని నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల్లోనూ కరోనా రోజురోజుకు పెరుగుతోంది. పది రోజుల నుంచి పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్నా… మృతుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా మరణాలు… ఆందోళనలో ప్రజలు - నర్సీపట్నం తాజా వార్తలు
నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా వైరస్ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆర్టీసీ కండక్టర్ తదితరులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రిలో చేరారు.
పట్టణంలో పెరుగుతున్నకరోనా కేసులు