విశాఖపట్నం జిల్లా మాడుగుల, చీడికాడ మండలాల్లో మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చీడికాడ మండలంలోని ఖండివరంలో 4, జైతవరం 2, కోనాం ఒకటి చొప్పున నమోదు కాగా, మొత్తం ఏడుగురికి వైరస్ సోకింది.
మాడుగుల పట్టణంలో కొత్తగా ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండడంపై ప్రజలు వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందుతున్నారు.