ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో విజృంభిస్తున్న కరోనా... పెరుగుతున్న కంటైన్మెంట్​ జోన్లు - visakha district latest corona news

విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓ ఎలక్ట్రానిక్​ దుకాణం నుంచి ప్రారంభమై ఇప్పటికి 44 కేసులకు విస్తరించింది. దీంతో కంటైన్మెంట్​ జోన్ల సంఖ్యలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతానికి చెందిన ముగ్గురు, మండల ప్రాంతానికి చెందిన నలుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు, వైద్య యంత్రాంగం అప్రమత్తమయ్యారు.

corona cases increasing in anakapalle town and officers and other staff gets alerted
కంటైన్మెంట్​ జోన్లలో పర్యటించిన ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరరావు

By

Published : Jun 15, 2020, 12:29 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్​గా 44 మందిని నిర్ధరించారు. పట్టణంలోని చింతావారివీధీలోని ఓ ఎలక్ట్రానిక్​ దుకాణం నుంచి ప్రారంభమైన కేసులు నెమ్మదిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పటికే లోనిభట్లపూడి, రేబాక, సత్యనారాయణపురం, దేవినగర్​లో కంటైన్మెంట్​ జోన్లను ఏర్పాటు చేశారు.

కంటైన్మెంట్​ జోన్లలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఎమ్మెల్సీ బుద్ధ నాగేశ్వరావు పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీవోకు, పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు సూచనలు చేశారు. అనకాపల్లి గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్​ కెమెరాలతో నిఘా పెట్టారు.

ఇదీ చదవండి : ధర్మవరం ఎమ్మెల్యే గన్​మన్ కరోనాతో మృతి

ABOUT THE AUTHOR

...view details