విశాఖలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటింది. గురువారం జిల్లాలో 79 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కేసుల సంఖ్య 1048కి చేరింది. జిల్లాలో కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచడంతో ఎక్కువ కేసులు బయటకు వస్తున్నాయని అధికార యంత్రాగం చెబుతోంది. కొవిడ్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో ఇద్దరు రోగులు మృతి చెందినట్లు కొవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ పీవీ సుధాకర్ వెల్లడించారు. ఈ ఇద్దరితో జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్ వల్ల మరణంచిన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 402 కాగా... 646 కేసులు ఇంకా యాక్టివ్‌లో ఉన్నాయి. అలాగే యాక్టివ్ క్లస్టర్లు, వెరీ యాక్టివ్ క్లస్టర్లు 92 ఉన్నాయి. డోర్మెంట్ క్లస్టర్లు 52 కాగా, డీనోటిఫైడ్ క్లస్టర్లు 28 ఉన్నట్లు అధికారి వెల్లడించారు.
విశాఖ జిల్లాలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - visakhapatnam latest corona news
విశాఖ జిల్లాలో గురువారం ఒక్క రోజే 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 1048 కేసులు నమోదు కాగా వీరిలో 402 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 646 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ క్లస్టర్ సంఖ్య కూడా 92కు చేరింది.
జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు నమోదు