విశాఖ జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. జిల్లాలో ఒక్కరోజే 1096 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కాగా...మొత్తం కేసుల సంఖ్య 34,818 కు చేరింది. ఇప్పటివరకు 28,500 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా... మరో ఆరువేల 7మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్ బారినపడి ఈనెల 28వ తేదీన ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 243కు చేరింది. అనకాపల్లిలో ఈ నెల 28వ తేదీన ఒక్క రోజే 60 కేసులు నమోదయ్యాయి. విశాఖ మన్యంలో 19, పాయకరావుపేట మండలంలో 18, చోడవరంలో 14, కే .కోటపాడులో 14, మఠంలో 8, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో 5 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విశాఖ జిల్లాలో కరోనా విజృంభణ - విశాఖ జిల్లాలో కరోనా వార్తలు
విశాఖ జిల్లాలో కరోనా రోజురోజుకి విస్తరిస్తోంది. ఒక్కరోజే 1096 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కాగా...మొత్తం కేసుల సంఖ్య 34,818 కు చేరింది. జిల్లా వ్యాప్తంగా 243మంది మరణించారు.
విశాఖ జిల్లాలో కరోనా విజృంభణ