ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెందుర్తిలో కరోనా కలకలం.. ఒక్క రోజే 59 కేసులు - విశాఖపట్నంలో కరోనా కేసులు

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఒక్క రోజే 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

corona cases increasing at penndhurthi
corona cases increasing at penndhurthi

By

Published : Aug 12, 2020, 5:32 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ సీఐకు, ఇద్దరు కానిస్టేబుల్స్ కు కరోనా సోకింది. ఇప్పటివరకు స్టేషన్లో సుమారు 15 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.

కేసులు నమోదు అయిన చోట అధికారులు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. బ్లీచింగ్ చల్లించారు. అనంతరం ప్రజలను అప్రమత్తం చేశారు. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details