ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పల్లెలకు పాకింది. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా మహమ్మారి అన్ని మండలాలకు వ్యాపించింది. దీంతో పల్లె ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో అధికారులు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాపించింది.
గ్రామాలను వణికిస్తున్న మహమ్మారి.. అప్రమత్తమైన అధికారులు
విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తోంది. గ్రామాలకు సైతం మహమ్మారి వ్యాపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు
చీడికాడ మండలం బైలపూడి గ్రామంలో వలన కూలీల దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళిద్దరూ కోలుకున్నారు. మాడుగుల మండలంలో ఒకటి, కె.కోటపాడు మండలంలో మూడు, దేవరాపల్లి మండలంలో రెండు కరోనా కేసులు ఇటీవల నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర స్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ