విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పరీక్షల్లో అనకాపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 17 మందికి కరోనా నిర్ధరణైంది. కరోనా సోకిన వారిలో అనకాపల్లికి చెందిన ఐదుగురు, కుంచంగికి చెందిన ఇద్దరు, సత్యనారాయణపురం, బవులవాడ, సత్యనారాయణపురం, మునగపాక కసింకోట, చోడవరం మండలం పీఎస్ పేటకు చెందినవారున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు.. స్థానికుల్లో ఆందోళన - అనకాపల్లి కరోనా తాజా సమాచారం
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసుల్లో పెరుగుదల స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ రెండు రోజుల్లోనే 17 మందికి కరోనా నిర్ధరణైంది.
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు.. స్థానికుల్లో ఆందోళన