ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో కరోనా విజృంభణ... ఒక్కరోజే 40 కేసులు నమోదు - latest updated news covid in vishaka

విశాఖ జిల్లా పాడేరు మండలంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం వరకు మొత్తం 364 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 40 మందికి కోవిడ్ సోకింది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

పాడేరులో కరోనా విజృంభణ... ఒక్కరోజే 40 కేసులు నమోదు
పాడేరులో కరోనా విజృంభణ... ఒక్కరోజే 40 కేసులు నమోదు

By

Published : Aug 12, 2020, 2:49 PM IST

విశాఖ జిల్లా పాడేరు మండలంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 364 వరకు కేసులు నమోదయ్యాయి. గడచిన ఒక్క రోజే 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 40 మందికి పాజిటివ్ వచ్చింది. మన్యంలో మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు చేయలేదు. మరోవైపు.. గిరిజన ప్రాంతంలో కరోనా చాపకింద నీరులా ప్రవహిస్తే కట్టడి చేయడం అసాధ్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

పాడేరు కేంద్రంలో 205 మంది వరకు చికిత్స పొందుతున్నారు. మన్యంలో 55 వరకు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఆస్పత్రి నుంచి 159 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఇద్దరూ కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాపారులు స్వచ్ఛందంగా వారం పాటు పాడేరు, అరకు లోయ, హుకుంపేట, పెదబయలులో లాక్​డౌన్ ప్రకటించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details