విశాఖలో కరోనా రోగుల సంఖ్య 300 దాటింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఇప్పటికే విశాఖలో 63 కంటైన్మెంట్ జోన్ లు ఏర్పాటు చేశామన్నారు. లక్షకు ఫైగా రాపిడ్ కరోనా టెస్టులు జరిగినట్టు తెలిపారు. వైద్యులకు కావలిసిన పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ 5 వేలకు పైగా సిద్ధం చేశామన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టాక.. ఎవరికి వారే కరోనా వ్యాప్తి నివారణకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. స్టేట్ కోవిడ్ ఆసుపత్రి, గీతం వైద్య విద్యాలయంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులు 90 శాతం మంది కోలుకున్నారని కలెక్టర్ తెలిపారు.
కరోనా విజృంభణతో మరింత అప్రమత్తం - విశాఖలో కరోనా కేసులు
రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రోగులకు సరిపడే పడకలు, అనుమానితుల వైద్య సేవలు కోసం ఐసొలేషన్ సెంటర్, క్వారంటైన్ సెంటర్లు సిద్ధం చేశారు. ఇప్పటికే విశాఖలో 63 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు.
విశాఖలో దండుబజార్, అప్పుఘర్, మాధవధార, గోపాలపట్నం, సీతమ్మధార, కె ఆర్ ఎం కాలనీ ప్రాంతాలలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా రోగులు ఉన్న ప్రాంతాల్లో 500 మీటర్లు దూరంలో పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా చేసి పోలీస్ పహారా కాస్తున్నారు. కరోనా కేసులు వచ్చిన చోట ఆ ప్రాంత పరిధిలోని వారికీ రాపిడ్ టెస్టులు చేస్తున్నారు. పోలీస్ విభాగం, వైద్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులకు సైతం కరోనా వ్యాప్తి చెందడంతో వివిధ కార్యాలయాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలతో పిచికారి చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తాం: సీఎం జగన్