విశాఖలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 1155 కేసులు నమోదు కావడం యంత్రాంగానికి కలవరపెడుతోంది. వీటితో జిల్లాలోయాక్టివ్ కేసుల సంఖ్య 8172 చేరింది. 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన వారు 528 మందికాగా.. మరణాలు మూడుగా నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 4066 కి చేరింది. జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో 94 మంది మృతిచెందారు. నగరంలో కొత్తగా 31 క్లస్టర్ల నుంచి కేసులు రావడంవల్ల వాటిని కొవిడ్ క్లస్టర్ల జాబితాలో చేర్చారు. వెరీ యాక్టివ్ క్లస్టర్ల సంఖ్య 325 గా ఉంది. యాక్టివ్ కస్టర్ల సంఖ్య 145 గాను, డోర్నమెంట్ క్లస్టర్లు 377 గా ఉన్నాయి. డీనోటిఫై చేసిన క్లస్టర్లు 39 గానే ఉన్నట్టు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్స్ పాల్ డాక్టర్ పివి సుధాకర్ వెల్లడించారు.
విశాఖలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 1155 కేసులు - విశాఖలో కరోనా కేసులు
విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జిల్లాలో 1155 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 8172 కు చేరింది.
corona cases