ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగుల నియోజకవర్గంలో విస్తరిస్తున్న కరోనా - మాడుగులలో కరోనా కేసులు

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. తాజాగా మాడుగులలో ఎరువుల వ్యాపారికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగికి కొవిడ్ సోకింది. వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో కరోనా వ్యాప్తి పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

corona cases in madugula constituency vizag district
మాడుగుల నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న కరోనా

By

Published : Jul 30, 2020, 12:34 PM IST

పల్లెల్లో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాపిస్తోంది. మాడుగుల, కే. కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మాడుగులలో ఎరువుల వ్యాపారికి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగికి కొవిడ్ సోకింది. ఆనందపురం, మర్రివలస, గొట్లామ్, సూర్రెడ్డిపాలెంలలో ఒక్కొక్కరికి వైరస్ నిర్ధరణ అయ్యింది. చీడికాడ మండలం అర్జునగిరి, నీలంపేట గ్రామాల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో కరోనా వ్యాప్తి పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details