విశాఖ జిల్లా చోడవరంలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 4 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నేడు విడుదల చేసి కొవిడ్ బులెటిన్‌లో 18 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. చోడవరంలో 11 కేసులు నమోదుకాగా.. మండలంలోని గవరవరం పీహెచ్సీ పరిధిలో 7గురికి పాజిటివ్‌గా తేలింది.
గోవాడలోని తెదేపా నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పూతి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు కరోనా బారిన పడ్డారు. చోడవరంలో పరీక్ష ఫలితాలు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. తాను హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.