విశాఖ జిల్లా చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చీడికాడ మండలం దిబ్బపాలెంలో రెండు, చీడికాడ, తురువోలు, జీ. కొత్తపల్లిలో ఒక్కోటి చొప్పున మొత్తం 5 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేవరాపల్లి మండలం బోయాలకింతాడలో రెండు, కొత్తపేట, వాకపల్లిలో ఒక్కోటి చొప్పున మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. మాడుగులలో 15 రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.