ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని బోండా గ్రామాల గిరిజనులు కరోనా భయంతో వణికిపోతున్నారు. వైరస్ వ్యాప్తి.. అక్కడి ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కోయిర్ ఫుట్ సమితి పరిధిలో ఉన్న ముదులిపడ, ఆంధ్రాహల్ పంచాయతీలో... మొత్తం 20 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ రెండు పంచాయతీల్లో ఆదిమ జాతికి చెందిన గిరిజనులకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బోండా తెగకు... కరోనా సోకిన విషయం తెలిసి మల్కన్‌గిరి ఐసీఐసీఐ బ్యాంక్ వారు స్పందించారు. స్థానిక అధికారుల తో కలసి కొన్ని గ్రామాలు సందర్శించి వారికి ఉచిత మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.