విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకింది. పట్టణంలోని చింతావారి వీధిలో ఒక ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్న కుటుంబంలోని నలుగురికి పాజిటివ్ తేలటంతో అనకాపల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. దుకాణంలో పనిచేసిన వారికి కరోనా పరీక్షలు జరిపారు. వీరిలో కొంత మందికి అనుమానిత లక్షణాలు బయటపడినట్లు తెలిసింది.
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా...ఆందోళనలో అనకాపల్లి వాసులు - ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
ఒకే కుటుంబానికి చెందిన నలుగురుకి కరోనా సోకటంతో విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా...ఆందోళనలో అనకాపల్లి వాసులు !
దీంతో అనకాపల్లి పట్టణంలోని దిబ్బవీధి, అగ్గిమర్రి చెట్టు, సంతబయలు, బుద్ద గంగునాయుడు వీధి ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించనున్నారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం బవులవాడ, భట్లపూడి, ఉమ్మలాడ ప్రాంతాల్లో కరోనా అనుమానితులు బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విశాఖ ఆసుపత్రికి తరలించారు.