ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో ఒక్కరోజే 8 కేసులు.. భయాందోళనలో ప్రజలు - అనకాపల్లిలో కరోనా కేసుల వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అనకాపల్లిలో మొత్తం 55 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 21 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.

corona cases in anakapalli vizag district
బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న పారిశుద్ధ్య కార్మికుడు

By

Published : Jun 27, 2020, 10:16 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో నర్సుకు కరోనా సోకింది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్​కు పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతని తండ్రికి వైరస్ సోకటంతో ఇతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితోపాటు విధులు నిర్వహిస్తున్న ఇతర పోలీసులకు పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది.

గవరపాలెంలోని దాసరిగెడ్డలో నివాసముంటున్న భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురికి వైరస్ సోకింది. పట్టణంలోని కోట్ని వీధిలో ఉంటున్న మరో వ్యక్తి కొవిడ్ బారిన పడ్డాడు. ఇప్పటివరకు అనకాపల్లిలో మొత్తం 55 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 21 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details