విశాఖ జిల్లా కలెక్టర్ కర్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోవిడ్ 19 నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజుల్లో 30కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్లోని అన్ని విభాగాలను శానిటైజ్ చేసి పరిమితమైన సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్నారు. సందర్శకులను సైతం పరిమితంగా అనుమతిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల వ్యక్తిగత సిబ్బందికి, భద్రతా సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు.