విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురవుతున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీతో పాటు నాతవరం, గోలుగొండ, మాకవరపాలెం మండలాల్లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది.
నర్సీపట్నం పురపాలక పరిధిలో... 250 కేసులకు పైగా నమోదు కాగా... మొత్తం 335 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు.