ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో కరోనా విజృంభణ... మరో ఏడు కొత్త కేసులు నమోదు - చోడవరంలో కరోనా కలకలం

విశాఖలోని చోడవరం పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పట్టణంలో ఇప్పటివరకు 71 మంది కోవిడ్ బారిన పడగా వీరిలో... 20 మంది హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు.

corona cases are increasing in chodavaram at vishaka
చోడవరంలో కరోనా విజృంభణ... మరో ఏడు కొత్త కేసులు నమోదు

By

Published : Aug 11, 2020, 5:09 PM IST

విశాఖలోని చోడవరం పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ వైద్య నివేదిక ప్రకారం పట్టణానికి చెందిన మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఓ మహిళా ఏఎస్సై, ఓ దినపత్రిక కంట్రిబ్యూటర్, బ్యాంకు ఉద్యోగిని ఉన్నారు.

చోడవరంలో ఇప్పటి వరకు 71 మంది కోవిడ్ బారిన పడగా వీరిలో... 20 మంది హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు. పోలీస్ స్టేషన్​లో నలుగురు సిబ్బంది, సర్కిల్ కార్యాలయంలో హెచ్​సీ, మహిళా హోమ్ గార్డులతో పాటు వెంకన్నపాలెం చెక్ పోస్టు వద్ద పనిచేసే ఏఎస్సె, హెచ్​సి, పొరుగు సేవల సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details