విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో కరోనా కేసు నమోదైంది. దీంతో స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే కొత్తకోటకు ఓ శుభకార్యం నిమిత్తం హాజరయ్యారు. అనంతరం కరోనా లక్షణాలు కనిపించి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. బాధితుని ఇంటి నుంచి 200 మీటర్ల పరిధి వరకు కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.
కొత్తకోటలో కరోనా కలకలం..ఏఆర్ కానిస్టేబుల్‌కు పాజిటివ్ - కొత్తకోటలో కరోనా కేసు కలకలం
కొత్తకోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యువకుడు ఇటీవల గ్రామంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటవ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
కొత్తకోటలో కరోనా కేసు నమోదు