కొవిడ్ కేసులు పెరుగుతున్నందున వాహనదారులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా అన్నారు. శనివారం సాయంత్రం ఆయన బీచ్ రోడ్డులో పర్యటించారు. మాస్క్ లేకుండా ప్రయాణిస్తే రూ. 100 జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు.
బీచ్‌రోడ్డులో హోలీ రంగులు వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిశ పోలీసులు యారాడ నుంచి రుషికొండ వరకు 23 వాహనాల ద్వారా పర్యవేక్షణ చేస్తారన్నారు. నిఘా కోసం ద్విచక్ర వాహనాలు ప్రారంభించారు. డీసీపీలు, ఈడీసీపీ రజని, దిశా ఏసీపీ ప్రేమ్‌కాజల్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.