విశాఖపట్నం జిల్లాలోని పలు గ్రామాల్లో.. కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రావికమతం సర్కిల్ పరిధిలోని కొత్తకోట, రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సామాజిక దూరం పాటించే విధంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇంటింటికీ కరపత్రాలు అందజేశారు. మాస్కులు, శానిటైజర్ లు వినియోగించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.
కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు - విశాఖ నేటి వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. విశాఖ జిల్లాలోని రావికమతం సర్కిల్లోని పలు గ్రామాల్లోని ప్రజలకు.. కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు