ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2020, 5:49 PM IST

Updated : Jun 27, 2020, 6:00 PM IST

ETV Bharat / state

మన్యంలో విస్తరిస్తున్న మహమ్మారి.. అప్రమత్తమైన అధికారులు

విశాఖ మన్యం పాడేరులో కరోనా కేసులు నమోదు కావడంపై.. అధికారులు మరింతగా ఆంక్షలు విధిస్తున్నారు. అనకాపల్లి సరిహద్దుల్లో పోలీసులు పహారా పెంచారు.

coroana-cases-in-paderu
మన్యంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి

విశాఖ మన్యానికి కరోనా తాకిడి తగిలింది. అప్రమత్తమైన పాడేరు అధికారులు నియంత్రించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వ్యాపారరీత్యా అనకాపల్లితో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటూ... ప్రతిరోజు కిరాణా, ఇతర సామగ్రి కోసం మన్యం వాసులు అక్కడికి చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు.. శుక్రవారం ఒక్క రోజే అనకాపల్లిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా.. మన్యానికి వ్యాపారులు రాకపోకలు నిలిపివేసేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.

సరిహద్దుల్లో వాహనాలు నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హుకుంపేట సంతలో సరిహద్దులోని వాహనాలను ఇప్పటికే వెనక్కి పంపేశారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. రద్దు విషయం తెలియని గిరిజనులు కొంత ఇబ్బందులు పడ్డారు. మన్యంలో ప్రస్తుతం ఐదు కేసులు నమోదు అయ్యాయి. మైదాన ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు మన్యంలో ప్రచారం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వైద్యుడు సుధాకర్‌ కేసులో రికార్డులు పరిశీలించిన సీబీఐ

Last Updated : Jun 27, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details