ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీలకు వంట పాత్రలు.. వస్త్రాలు పంపిణీ - కూండ్రపువానిపాలెంలో సరకుల పంపిణీ

విశాఖ జిల్లా కూండ్రపువానిపాలెంలో కూలీలకు శ్రీ రావాలమ్మ తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం తరుపున కూలీలకు వంటపాత్రలు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కె.కోటపాడు ఎస్ఐ మల్లేశ్వరరావు చేతులమీదుగా వాటిని అందజేశారు.

Cooking utensils for laborers .. Distribution of textiles
కూలీలకు వంట పాత్రలు.. వస్త్రాలు పంపిణీ

By

Published : Oct 26, 2020, 8:29 PM IST


విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కూండ్రపువానిపాలెం గ్రామానికి చెందిన శ్రీ రావాలమ్మ తాపీమేస్త్రీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూలీలకు వంటపాత్రలు, మహిళలు, పురుషులకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.కోటపాడు ఎస్ఐ మల్లేశ్వరరావు హాజరయ్యారు. ఆయన చేతులమీదుగా 70 మంది కూలీలకు రూ.2.50 లక్షల విలువైన సామాగ్రి అందజేశారు. కారోనాతో కష్టకాలంలో ఉన్న కూలీలకు శ్రీ రావాలమ్మ తాపీమేస్త్రీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సేవలు అభినందనీయమని ఎస్​ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పలనాయుడు, పీఆర్​టీయూ కె.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details