ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెదబయలులో వంట గ్యాస్ సిలెండర్​ పేలి దంపతులకు గాయాలు - వంట గ్యాస్ పేలి భార్యభర్తలకు గాయాలు

విశాఖ మన్యంలో వంట గ్యాస్ సిలెండర్​ పేలి భార్యభర్తలకు గాయాలయ్యాయి. గ్యాస్ పేలుడు శబ్దానికి మావోయిస్టుల బాంబు పేలుళ్లు జరిగాయేమోనని మన్యం వాసుల ఆందోళనకు గురయ్యారు.

Cooking gas explodes and two injured at pedabayalu in vishaka
పెదబయలులో వంట గ్యాస్ పేలి భార్యభర్తలకు గాయాలు

By

Published : Jul 22, 2020, 10:50 AM IST

విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో గ్యాస్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. టీ పెట్టుకుందామని రాము అనే వ్యక్తి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలెండర్​ పేలింది. ఇంటి రేకులు చీల్చుకుంటూ సిలిండర్ గాలిలో ఎగిరింది. ప్రమాదంలో రాము, అతని భార్య తారాదేవి గాయపడగా... వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ పేలుడు శబ్దానికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే జరగడంతో మావోయిస్టుల బాంబు పేలుళ్లు అనుకుని ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details