ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒప్పంద స్టాఫ్ నర్సుల ధర్నా - Nurses Dharna in Visakha News Today

విశాఖ నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రి ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ నిరసనకు దిగారు. కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒప్పంద స్టాఫ్ నర్సుల ధర్నా
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒప్పంద స్టాఫ్ నర్సుల ధర్నా

By

Published : Jun 19, 2021, 10:26 PM IST

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి ఒప్పంద స్టాఫ్ నర్సులు నిరసన బాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ధర్నా చేపట్టారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రూ.50 లక్షల పరిహారం కావాలి : స్టాఫ్ నర్సులు

బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని.. కుటుంబంలో ఒక్కరికి శాశ్వత ఉపాధిని సైతం కల్పించాలన్నారు. ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులకు ఒకే క్యాడర్ ఒకే వేతనం అమలు చేయాలని కోరారు. ఏడాదిలో 35 క్యాజువల్ లీవ్స్ ( సీఎల్​లు) వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వచ్చిన సిబ్బందికి 14 రోజులు ఇవ్వాలని.. లేనిపక్షంలో మండల కేంద్రాల్లోని జీజీహెచ్​లోనూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల జూన్ 28 నుంచి సమ్మెకు దిగుతామన్నారు.

ఇవీ చూడండి : Case on Lokesh:విజయవాడ సూర్యారావుపేట పీఎస్‌లో లోకేశ్‌పై కేసు నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details