విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవిపేట, నర్సింగరావుపేట ప్రాంతాల్లోని కంటెన్మెంట్ జోన్లను అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు పరిశీలించారు. కంటైన్మెంట్ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పారిశుద్ధ్యం, బారికేడ్ల ఏర్పాట్లను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజలంతా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్నందునా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లో ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో - Containment guidelines must be strictly adhered to by the people- rdo
విశాఖ జిల్లా అనకాపల్లిలోని కంటైన్మెంట్ ప్రాంతాలను పరిశీలించారు ఆర్డీవో సీతారామారావు. ఆరోగ్య పరిరక్షణకు ప్రజలంతా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
కంటైన్మెంట్ మార్గదర్శకాలు ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో