ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మ‌న్యానికి 14 కొత్త అంబులెన్స్‌లు - కంటైన‌ర్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వార్తలు

నిండు గర్భిణులను మంచంపై, డోలీల్లో మోసుకొని వెళ్లడం.. మన్యంలో మనం తరుచు చూస్తున్న దృశ్యాలు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన అటవీ ప్రాంతాల్లో అంబులెన్స్​ సర్వీసులు.. సమయానికి రాకపోవడం షరా మాములే. ఈ సమస్యను గుర్తించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ.. సామాజిక సేవా బాధ్య‌త కింద కంటైన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ స‌హ‌కారంతో 14 అంబులెన్స్‌ల‌ను కొనుగోలు చేశారు.

Container Corporation of India grant new ambulances
విశాఖ మ‌న్యానికి కొత్త అంబులెన్స్‌లు

By

Published : Feb 19, 2020, 3:46 PM IST

విశాఖ మ‌న్యానికి కొత్త అంబులెన్స్‌లు

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. విశాఖ మన్యంలో అంబులెన్స్​ల కొరత ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. కిలోమీట‌ర్ల దూరం కాలిన‌డ‌క‌న డోలీల్లో రోగుల‌ను త‌ర‌లించే దృశ్యాలు మనల్ని కలచివేస్తూనే ఉంటాయి. ఇలాంటి పద్దతిలో మార్పు తెచ్చేందుకు నడుం కట్టారు విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ. ఈయన చొర‌వ‌తో మ‌న్యానికి అంబులెన్స్​లను ఇచ్చేందుకు ఒక కార్పొరేష‌న్ కంపెనీ ముందుకు వ‌చ్చింది. సామాజిక సేవా బాధ్య‌త కింద కంటైన‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ రూ.3.4 కోట్ల వ్య‌యంతో 14 అంబులెన్స్‌ల‌ను కొనుగోలు చేసింది. పాడేరు జిల్లా ఆసుప‌త్రితో పాటు అర‌కు, చింత‌ప‌ల్లి, ముంచింగుపుట్‌లకు పెద్ద అంబులెన్స్‌లను, మిగ‌తావి అంబులెన్స్‌లు లేని ఆసుప‌త్రుల‌కు అంద‌జేశారు.

ABOUT THE AUTHOR

...view details