ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బౌద్ధారామాల భూముల్లో అతిథి గృహాల నిర్మాణం తగదు - construction of guest houses on Buddhist lands is inappropriate

విశాఖ జిల్లా భీమిలి కాపులుప్పాడ గ్రామ పరిధిలోని తొట్లకొండ ప్రాచీన బౌద్ధారామం విస్తరించి ఉన్న భూముల్లో అతిథి గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని జిల్లా మహాబోధి సంఘం నిరసన తెలిపింది. ఆదివారం ఎన్ఎడి కొత్త రోడ్డు విశాఖ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉన్న బుద్ధుని విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.

construction of guest houses on Buddhist lands is inappropriate
బౌద్ధారామాల భూముల్లో అతిథి గృహాల నిర్మాణం తగదు

By

Published : Sep 21, 2020, 3:00 PM IST

విశాఖ జిల్లా భీమిలి కాపులుప్పాడ గ్రామ పరిధిలోని తొట్లకొండ ప్రాచీన బౌద్ధారామం విస్తరించి ఉన్నాయి. ఆ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అతిథి గృహ నిర్మాణాలకు ప్రయత్నించడం తగదని జిల్లా మహాబోధి సంఘం నిరసన తెలిపింది. ఎన్ఎడి కొత్త రోడ్డు విశాఖ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉన్న బుద్ధుని విగ్రహం ముందు ఆందోళన చేశారు.

బుద్ధుని విగ్రహం ముందు భిక్షువులతో ప్రసరణం బుద్ద వందనం, పంచశీల పూజ, ప్రార్థనలు, సామూహికంగా నిర్వహించారు. జీవో నెం.1353 జారీ తగదని.. ఈ దుశ్చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్ర బౌద్ధ భిక్షువు ధర్మానంద బంతేజ డిమాండ్ చేశారు. విశాఖ భీమిలీ, తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, అనకాపల్లి ,బుద్ధుని కొండ, బొజ్జన్న కొండ బౌద్ధారామాలను పరిరక్షించి… పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలని మహాబోధి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు..ప్రభుత్వం వెంటనే ఈ భూములపై నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: విషాదం..బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details